నూతన రేషన్ కార్డుల పంపిణీపై అవగాహన

నూతన రేషన్ కార్డుల పంపిణీపై అవగాహన

PLD: ఎడ్లపాడులో మంగళవారం రేషన్ షాప్ డీలర్లు, సచివాలయం సిబ్బందితో తహసీల్దార్ విజయశ్రీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విధానంపై అవగాహన కల్పించారు. ప్రతి రేషన్ షాప్‌కు ఒక సచివాలయం సిబ్బందిని అనుసంధానించారు. మొబైల్ అప్లికేషన్, ఈ-పోస్ యంత్రాల ద్వారా కార్డులు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు.