ఆమదాలవలసలో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం అలమాజి పేట పంప్ హౌస్ వద్ద ఉన్న బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ కారణంగా మార్చి 5 నుంచి మార్చి 11 వరకు రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అవసరానికి మించి వృథా చేయవద్దని కోరారు.