ఘనంగా మైనార్టీ నాయకుల ఇఫ్తార్ విందు
SRD: మనూరు మండల కేంద్రంలోని మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సిద్ధారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొని మైనార్టీ సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస (రోజా) దీక్షను విరమింపజేశారు. అనంతరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండరిరెడ్డి, సిద్ధారెడ్డి, సర్దార్ ఉన్నారు.