కార్తీకమాసం సందర్భంగా గోదావరికి పోటెత్తిన భక్తులు
NZB: కార్తీకమాసం సందర్భంగా పవిత్రమైన కార్తీక స్నానాలు చేసేందుకు భక్తులు గోదావరికి పోటెత్తారు. ఈ పవిత్రమాసంలో రెండో సోమవారం సందర్భంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల గోదావరి తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామున నుంచే భక్తులు గోదావరి స్నానాల కోసం భారీగా తరలివచ్చారు. అనంతరం కార్తీక దీపాలను గోదావరిలో వదిలి తమ మొక్కులు తీర్చుకున్నారు.