ఇర్గిపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం
SRD: సంగారెడ్డిలోని ఇర్గిపల్లి గ్రామంలో సర్పంచ్ సుప్రియ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు గ్రామస్థులకు బీపీ, షుగర్ వంటి రక్త పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.