ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి
TG: ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సంస్థ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులు సహకరించాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ కసరత్తు చేస్తోందన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని, అందుకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.