రెస్టారెంట్‌లలో ఎక్సైజ్ అధికారుల తనిఖీ

W.G: పెనుమంట్ర మండలంలో ఎక్సైజ్ శాఖ సోమవారం విస్తృత తనిఖీలు చేశారు. తణుకు ప్రాహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.మణికంఠ తెలిపిన వివరాల ప్రకారం.. మార్టేరు, వెలగలేరు గ్రామాల్లో దాబా, రెస్టారెంట్‌లలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారని సమాచారంతో దాడులు చేశామన్నారు. వీటిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్సైలు ఉన్నారు.