వైభవంగా ధర్మపురి మహాలక్ష్మి వ్రతం
JGL: చైత్ర పంచమిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీ మహాలక్ష్మి రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి తీరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద పుష్పాలతో అలంకరించిన రథంపై మహాలక్ష్మి ఉత్సవ మూర్తిని ఆశీనులు గావించారు. ప్రత్యేక హారతుల అనంతరం రథాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకువెళ్లారు.