సిలిండర్ లీకై దంపతులకు తీవ్ర గాయాలు
సత్యసాయి: ధర్మవరంలోని సిద్దయ్యగుట్ట కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం తోపుడు బండిపై వడలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.