సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీహెచ్‌వో

WNP: సీజనల్ వ్యాధుల పట్ల గోపాల్ పేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు హితవు పలికారు. దోమల నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలు వేడి ఆహార పదార్థాలను తీసుకోవలని సూచించారు.