గిద్దలూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

గిద్దలూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు, బురుజుపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యానశాఖ అధికారి శ్వేత పాల్గొని, ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ప్రత్యేకంగా పసుపు పంటలో దుంపకుళ్ళు, ఆకు మచ్చ తెగులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.