జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

సూర్యాపేట: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 9.58 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా తిరుమలగిరిలో 12.37%, అత్యల్పంగా సూర్యాపేటలో 7.52% పోలింగ్ జరిగింది. 137 వార్డుల్లోని 361 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.