నరసాపురంలో దళిత సంఘాల ఆందోళన

నరసాపురంలో దళిత సంఘాల ఆందోళన

WG: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం నరసాపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. చంద్రగిరిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై మూత్రం పోసి, గాయపరిచిన నిందితులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.