దత్తాత్రేయ స్వామి ఆలయంలో అన్నదానం
GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం తొలిసారిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. అన్నదానానికి మించిన సేవ లేదని ఆలయ సేవకుడు పకీరప్ప ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.