VIDEO: దొంగ గెడ్డ సమస్య పరిష్కారించండి
AKP: అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఉన్న దొంగ గెడ్డ సమస్య పరిష్కారించాలని గ్రామస్తులు కోరారు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం వల్ల దొంగ గెడ్డ ఉధృతంగా రావడంతో సుమారు 5 గ్రామాలు ప్రజలు గెడ్డలో నుంచి వెళ్లాలి అంటే అరచేతిలో ప్రాణాలు పట్టుకొని వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని కోరారు.