సందిగ్ధంలో పాకిస్తాన్-శ్రీలంక వన్డే సిరీస్
పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తీవ్ర సందిగ్ధంలో పడింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో బాంబు దాడులు జరగడంతో శ్రీలంక క్రికెటర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనితో వారు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. వారి రక్షణకు పూర్తి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.