నా శవంపై కప్పేది కాషాయ జెండానే: బండి సంజయ్
TG: డాక్టర్ లక్ష్మణ్ మాదిరిగా ఏదో ఒక రాష్ట్రానికి బండి సంజయ్ వలస పోక తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. 'వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే కాదు. చావైనా బతుకైనా కరీంనగర్‌తోనే.. నా రక్తం కాషాయమే. నేను చనిపోతే నా శవంపై కప్పేది కూడా కాషాయ జెండానే' అని అన్నారు.