ఆ డబ్బు భారతీయుల ప్రాణాలు తీస్తుంది: గవాస్కర్

ఆ డబ్బు భారతీయుల ప్రాణాలు తీస్తుంది: గవాస్కర్

పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ చెల్లించే డబ్బులు భారతీయుల ప్రాణాలు తీస్తాయని మండిపడ్డాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అబ్రార్ అహ్మద్‌ను రూ.2.32 కోట్లకు కొనుగోలు చేసింది.