నేడు రాయదుర్గంలో ప్రజాదర్బార్
ATP: రాయదుర్గం ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఉ.10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల కన్వీనర్ హనుమంతు, ఎంపీడీవో కొండన్న తెలిపారు.