నన్ను 'అంకుల్' అంటే షాక్ అవుతా: మాధవన్

నటుడు మాధవన్ తన వయసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల స్నేహితులు తనను ‘అంకుల్’ అని పిలిచినప్పుడు మొదట షాక్‌కు గురైనప్పటికీ, ఆ తర్వాత ఆ పదాన్ని అంగీకరించక తప్పదని అన్నారు. వయసు పెరగడం ఒక సహజ ప్రక్రియ అని, దాన్ని మనం ఒప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ వయసులో కూడా తాను మంచి పాత్రలు పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.