తుఫాన్ బాధితులకు మెరుగైన సౌకర్యాలు: RDO
KKD: 'మొంథా' తుఫాన్ నేపథ్యంలో కాకినాడ RDO మల్లిబాబు ఉప్పాడ సెంటర్ వద్ద అధికారులతో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు పూర్తిస్థాయిలో ఆహారం, మంచినీరు, పాలు, ఇతర సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో సూచించారు.