భక్తిశ్రద్ధలతో ఘనంగా సంకటహర చతుర్దశి పూజలు
ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం సంకటహర చతుర్దశి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వినాయకుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సంకటహర చతుర్దశి అనేది ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజున జరుపుకునే గణేశుడి పండుగని ఆలయ అర్చకులు తెలిపారు.