రూ. వెయ్యి కోసం హత్య.. ముగ్గురు అరెస్ట్
RR: మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో రూ. వెయ్యి విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. వట్టేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అఫ్రోజ్ (25)ను అతని ముగ్గురు స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్లు కత్తితో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోసీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.