సప్తస్వరాలు పలికే అరుదైన విగ్రహం

సప్తస్వరాలు పలికే అరుదైన విగ్రహం

GDWL: మానవపాడు మండలం చెన్నిపాడులోని 16వ శతాబ్దపు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని పురావస్తు శాఖ అత్యంత అరుదైనదిగా గుర్తించింది. శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని మీటితే సప్తస్వరాలు పలుకుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోనే ఇలాంటి విగ్రహం లేదని, ఆలయ ప్రాంగణంలోని సంస్కృతం, కన్నడ, తెలుగు భాషల శిలాఫలకాలను కూడా పరిశీలించినట్లు వారు వెల్లడించారు.