లైబ్రరీలో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

అన్నమయ్య: గాలివీడు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో లైబ్రేరియన్ రామచంద్రనాయక్ పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. చెత్త ఊడ్చే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో చిన్నారి కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. విషయంపై బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.