పోతుల వీరభద్రరావు అజాతశత్రువు: మంత్రి దుర్గేశ్
E.G: మాజీ MLA పోతుల వీరభద్రరావు అజాతశత్రువు అని మంత్రి కందుల దుర్గేశ్ కొనియాడారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి శ్రీ వీరేశలింగం పురమందిరంలో జరిగిన వీరభద్రరావు 27వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని నివాళులర్పించారు. రాజకీయం, సాహిత్యం, క్రీడా రంగాల్లో ఆయన చెరపలేని ముద్ర వేశారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఆయన చిరస్మరణీయులని పేర్కొన్నారు.