వారితోనే ఉంటా: సీఎం

AP: పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చేవరకు వారితోనే ఉంటానని తెలిపారు. 'కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటే జీవితంలో పైకి రాగలం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చాం. మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు' అని పేర్కొన్నారు.