వైన్ షాప్‌లో చోరీకి పాల్పడిన మైనర్‌లు అరెస్టు

WGL : పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలోని ఇటీవల రాజన్న వైన్స్ షాపులో దొంగతనానికి పాల్పడిన నలుగురు మైనర్ నేరస్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. నలుగు నేరస్తులు మైనర్‌లు , వీరి వద్ద నుంచి 20వేల నగదు, 04 సెల్ ఫోన్లు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.