ఆగిపోయిన డయాలసిస్ సేవలు

ఆగిపోయిన డయాలసిస్ సేవలు

VKB: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ఆగిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డయాలసిస్ సెంటర్ పనిచేయలేకపోతోంది. చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. గంటల తరబడి వేచిచూసినా సేవలు పునరుద్ధరించకపోవడంతో రోగులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.