తొర్రూర్‌లో ఘనంగా కాన్షిరామ్ జయంతి వేడుకలు

తొర్రూర్‌లో ఘనంగా కాన్షిరామ్ జయంతి వేడుకలు

MHBD: తొర్రూర్‌లో మాన్యశ్రీ దాదాసాహెబ్ కాన్షిరామ్ 92వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. బహుజన జేఏసీ నాయకులు సుంచు మురళీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మురళి మాట్లాడుతూ.. 5 శాతం లేని అగ్రవర్ణాలు ఈ దేశ పరిపాలనను వారి చేతుల్లో ఉంటే "మేమెంత జనాభా మాకు అంత రాజ్యంలో వాటా కావాలి" అని బహుజన ప్రజలను చైతన్యపరిచిన గొప్ప నాయకుడు కాన్షిరామ్ అని అన్నారు.