VIDEO: అగ్ని ప్రమాదం.. ఆస్తి నష్టం ఎంతంటే..?
ADB: నేరడిగొండలోని బోరిగాం గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో జాదవ్ ప్రేమ్ సింగ్, సుందర్, అంబర్ సింగ్ ఇల్లు అగ్నితో ఆహుతయ్యాయి. అదేవిధంగా జాదవ్ రెడ్డియా, బిక్కులాల్‌కు చెందిన పశువుల కొట్టాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది.