సేవా భావాన్ని చాటుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
BDK: చుంచుపల్లి మండలం బాబు క్యాంప్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కొత్తగూడెం ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ గడ్డం ప్రవీణ్ కుమార్ మానవతా సేవలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటింగ్‌కు వచ్చిన వయోవృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఇబ్బందులు పడకుండా, వీల్‌ఛైర్ సహాయంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేలా సహకరించి యువతకు ఆదర్శంగా నిలిచారు.