జాతరలో బారికేడ్లపై భక్తుల అసంతృప్తి

TPT: నాయుడుపేట పోలేరమ్మ జాతరలో కొత్త ఆచారాలంటూ భక్తులు మండిపడ్డారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు జాతర జరిగింది. పోలేరమ్మ ఊరేగింపు సందర్భంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రమాదాలకు దారి తీసేలా బారికేడ్లు ఏంటని భక్తులు ప్రశ్నించారు.