మహిళ హత్య కేసులో నిందితుడికి రిమాండ్
NZB: ధర్పల్లి మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. చత్రు తండాకు చెందిన కాంతి(50)ని డబ్బుల గొడవతో ధర్పల్లికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి నైలాన్ దారంతో ఉరివేసి హత్య చేసినట్లు సీఐ భిక్షపతి వెల్లడించారు. మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తుండగా కిందపడిపోవడంతో నిందితుడు అక్కడే వదిలి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిందన్నారు.