పట్టు చీరఫై బాలకృష్ణ ఫోటో

సత్యసాయి: హిందూపురం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆర్‌సీ కోనయ్య కుమారులు అశ్వర్థనారాయణ, నారాయణస్వామి, ఆనంద్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్రాన్ని పట్టు చీరపై నేశారు. బాలకృష్ణ మీద తమకున్న అభిమానంతో సొంత ఆలోచనతో చేసినట్లు వారు తెలిపారు. పట్టు చీరపై బాలకృష్ణ ఫోటో నేయడంతో పలువురు వారిని అభినందిస్తున్నారు.