'రక్తదానానికి యువత ముందుకు రావాలి'
VZM: రక్తదానానికి యువత ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ కోరారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి పురస్కరించుకొని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది. రక్తదానంతో ఎందరో ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంబాబు రవితేజ పాల్గొన్నారు.