బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలు అందించాలి: కలెక్టర్
ASF: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలు అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో చేపట్టే ప్రత్యేక సమగ్రత సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలు సేకరించేందుకు బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటింటికి వెళ్తారన్నారు.