ఈనెల 13న బాలుర అండర్ -14 క్రికెట్ జట్టు ఎంపిక

KKD: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 13న కాకినాడ ఆర్ఎసీ మైదానంలో నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి నక్కా వెంకటేష్ తెలిపారు. సెప్టెంబర్ 1, 2011న ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. క్రీడాకారులు జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, క్రీడా దుస్తులు ధరించి రావాలన్నారు.