వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

ప్రకాశం: అర్ధవీడులో ఎస్ఐ సుదర్శన్ యాదవ్ శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, కొత్తవారి వివరాలను ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.