INSPIRATION: బంకించంద్ర ఛటర్జీ
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉత్తేజాన్ని నింపిన 'వందేమాతరం' గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ. 1838లో బెంగాల్‌లో జన్మించిన ఆయన, ఆధునిక బెంగాలీ సాహిత్య పితామహుడిగా పేరుగాంచారు. ఆయన రాసిన 'ఆనందమఠం' నవలలోని 'వందేమాతరం' గీతం భారతీయులలో దేశభక్తిని రగిలించింది. భారతీయ సంస్కృతి, జాతీయతను ప్రతిబింబించేలా ఆయన చేసిన రచనలు నేటికీ స్ఫూర్తిదాయకం.