మొదటి దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

మొదటి దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

KMR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. 157 గ్రామ పంచాయతీలు, 1444 వార్డుల్లో ఎన్నికల విధులకు అవసరమైన 1457 టీములను ఆయా గ్రామ పంచాయతీలకు నియమించారు.