కిక్ బాక్సింగ్ పోటీల్లో మెరిసిన వరంగల్ క్రీడాకారులు

కిక్ బాక్సింగ్ పోటీల్లో మెరిసిన వరంగల్ క్రీడాకారులు

WGL: సీఎం కప్ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి 414 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వరంగల్‌కు చెందిన సాయి మల్లిక, రోషన్ పాయింట్ ఫైట్ 55, 57 కేజీల విభాగాలలో రజత పతకం సాధించారు. తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు రామాంజనేయులు, తదితరులు ఉన్నారు.