కేరళంలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల
కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి మేనిఫెస్టోను అక్కడి నేతలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలకు యూడీఎఫ్ ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తుందని రేవంత్ పేర్కొన్నారు. ప్రజలు యూడీఎఫ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.