BRS కార్యకర్తకు నివాళులర్పించిన జగదీశ్ రెడ్డి
SRPT: దాడిలో హత్యకు గురైన BRS కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్, మాజీ MP లింగయ్య యాదవ్ నివాళులు అర్పించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అరాచకాలు పెరిగాయని, తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయని, మల్లయ్య హత్య ప్రజల్లో భయాందోళనలు రేపుతోందన్నారు.