'రాజకీయాలలో గెలుపోటములు సహజం'

'రాజకీయాలలో గెలుపోటములు సహజం'

JGL: రాజకీయాలలో గెలుపోటములు సహజమని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట్, సిర్పూర్, రత్నాపూర్ గ్రామాలలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను సోమవారం ఆయన పరామర్శించారు. ఓటమితో అధైర్యపడాల్సిన అవసరం లేదని హితవు పలికారు. పార్టీ ఎల్లప్పుడూ తమ వెంటే ఉంటుందన్నారు.