మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ దాడులు

HYD: డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీలు జరిపిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 బృందాలు సోదాలు చేపడుతున్నాయి.