VIDEO: 'ఇసుక దోపిడీని అరికట్టాలి'

అన్నమయ్య: జిల్లాలోని తంబళ్లపల్లె పెద్దేరు ప్రాజెక్టు వద్ద ఇసుక దోపిడీ ఆగడం లేదని స్థానిక రైతులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండ దండలతో పట్టపగలే జేసీబీలు, హిటాచీలను ఉపయోగించి ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్లలో పొరుగున ఉన్న సత్యసాయి జిల్లాకు అక్రమ రవాణా సాగిస్తున్నారు. అధికారులు ఇసుక దోపిడీని అరికట్టాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.