పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బుధవారం పట్టణంలోని ZPSS (గర్ల్స్) పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.