'ప్రజల తరఫున పోరాడే అభ్యర్థులను గెలిపించాలి'
KMM: ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్న అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ ప్రజలకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కొదుమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలమున్న అన్నిచోట్లలో పోటీ చేయాలని సూచించారు. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.