ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ సోదాలు..?
MDK: మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఏసీబీ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. తనిఖీలకు గల కారణాలపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం హాస్పిటల్‌లోని పత్రాలు, రికార్డులు తనిఖీ చేస్తున్నామని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.